Group-D: గ్రూప్ -డి దరఖాస్తుకు నేడే చివరి తేదీ! 1 y ago
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్-డి ఖాళీల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్దులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23 న ప్రారంభమైంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మార్చి 1. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.